కాజీపేట మహిళా టీటీఐ నీలిమను రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికులు!
- కాజీపేట జంక్షన్ లో ఘటన
- రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తులు
- జరిమానా కట్టాలని అడిగితే గొడవ
దీంతో ఆగ్రహానికి లోనైన వారు, నీలిమను బయటకు తోసేశారు. దీంతో ఆమె కాలు ప్లాట్ ఫామ్ సందులోకి జారిపోవడంతో, పక్కనే ఉన్న జనరల్ బోగి ప్రయాణికులు ఆమెను బయటకు తీశారు. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రయాణికులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.