Kagipet: కాజీపేట మహిళా టీటీఐ నీలిమను రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికులు!

  • కాజీపేట జంక్షన్ లో ఘటన
  • రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తులు
  • జరిమానా కట్టాలని అడిగితే గొడవ

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని జరిమానా కట్టాలని కోరినందుకు, మహిళా ట్రావెలింగ్‌ టికెట్‌ ఇనస్పెక్టర్‌ (టీటీఐ)ను కొందరు ప్రయాణికులు బలవంతంగా బోగీ నుంచి బయటకు తోసివేశారు. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని కాజీపేట జంక్షన్‌ లో జరిగింది. కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా పనిచేస్తున్న నీలిమ, సికింద్రాబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ ప్రెస్‌ లో కాజీపేటకు వచ్చారు. స్లీపర్ క్లాస్ బోగీలో టికెట్ తనిఖీలకు వెళ్లగా, కొందరు జనరల్‌ టికెట్‌ తీసుకుని ప్రయాణిస్తుండటాన్ని గమనించి, జరిమానా విధించారు.

దీంతో ఆగ్రహానికి లోనైన వారు, నీలిమను బయటకు తోసేశారు. దీంతో ఆమె కాలు ప్లాట్ ఫామ్ సందులోకి జారిపోవడంతో, పక్కనే ఉన్న జనరల్‌ బోగి ప్రయాణికులు ఆమెను బయటకు తీశారు. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రయాణికులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

More Telugu News