Vijay Kanth: బీజేపీ-అన్నా డీఎంకేతో చేతులు కలిపిన విజయ్‌కాంత్ పార్టీ

  • మోదీ తమిళనాడు పర్యటనలో పొత్తు ఖరారు
  • తొలుత డీఎంకేతో పొత్తుకు సిద్ధమైన విజయ్ కాంత్
  • సీట్ల పంపకాల్లో తేడాతో విరమణ
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో విజయ్ కాంత్ పార్టీ కూడా చేరిపోయింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ పొత్తు ఖరారైంది. నేడు విజయకాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి అన్నాడీఎంకే నేతలతో చర్చలు జరిపారు. విజయ్ కాంత్‌కు చెందిన డీఎండీకే పార్టీ కూడా తమ కూటమిలో చేరినట్టు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు.

మొదట విజయ్ కాంత్ డీఎంకేతో పొత్తుకు మొగ్గు చూపారు. కానీ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో పొత్తు విరమించుకున్నారు. సీట్ల పంపకాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. డీఎండీకేకు 4 - 5 సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
Vijay Kanth
DMDK
Narendra Modi
Piyush Ghoyal
Tamilnadu
Panneer Selvam

More Telugu News