Andhra Pradesh: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డేటా చోరీ కేసుపై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు

  • తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్ కు బదిలీ
  • ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పనిచేయనున్న సిట్

డేటా చోరీ కేసుకు సంబంధించి ‘ఐటీ గ్రిడ్’ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన దర్యాప్తు మొత్తం సిట్ కు బదిలీ చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఈ బృందం పనిచేయనుంది. ఈ బృందంలో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, మరో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలోనే సిట్ కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు.

More Telugu News