పాత వీడియోను చూపించిన పాక్... ఫేక్ అని పట్టేసిన నెటిజన్లు!
- జలాంతర్గాములు తమ నీళ్లలోకి వచ్చాయని ఆరోపణ
- 2016 నాటి వీడియోను చూపిందంటున్న నెటిజన్లు
- తొలుతగా కనిపెట్టిన ఇండియా టుడే యాంటి ఫేక్ న్యూస్ వార్ రూమ్
ఈ విషయాన్ని తొలుత ఇండియా టుడే యాంటి ఫేక్ న్యూస్ వార్ రూమ్ కనిపెట్టింది. పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత్ మండిపడగా, పాక్ చూపిస్తున్న పాత వీడియోను వైరల్ చేస్తూ, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పటిదో వీడియోను తెచ్చి, కొత్త తేదీని యాడ్ చేసి పాక్ గగ్గోలు పెడుతోందని, గతంలోనూ ఇటువంటి నిందలే మోపిందని ఆరోపిస్తున్నారు. ఇటువంటివి తాము వేలల్లో తయారు చేసి పాక్ పై ఆరోపణలు చేయగలమని అంటున్నారు.