nandita sweta: నందిత శ్వేత ప్రధానపాత్రధారిగా 'ఐపీసీ 376' .. ఫస్టులుక్ రిలీజ్

  • బిజీ అవుతోన్న నందిత శ్వేత
  •  నాయిక ప్రాధాన్యతగల కథ
  •  త్వరలోనే పూర్తి వివరాలు

'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగులో నందిత శ్వేత మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆమె సంపాదించుకున్న క్రేజ్ కారణంగా నాయిక ప్రాధాన్యత కలిగిన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తెలుగులో 'అక్షర' సినిమా చేస్తోన్న ఆమె, తమిళంలోను ఒక సినిమాను చేస్తోంది.

ఎస్. ప్రభాకర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'ఐపీసీ 376' అనే టైటిల్ ను ఖరారు చేసేశారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఇదే టైటిల్ తో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నందిత శ్వేత ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్టులుక్ లో నందిత శ్వేత డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News