New Delhi: ఢిల్లీలో ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం...సెక్యూరిటీ గార్డుకు గాయాలు

  • మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • లోధీ రోడ్డు పండిట్‌ దీనదయాల్‌ అంత్యోదయ భవన్‌లో ఘటన
  • ఈ అంతస్తులో సామాజిక మంత్రిత్వశాఖ కార్యాలయం
ఢిల్లీ లోధీ రోడ్డులోని పండిట్‌ దీనదయాల్‌ అంత్యోదయ భవన్‌లో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనంలోని అయిదో అంతస్తులో కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ కార్యాలయం ఉంది. సరిగ్గా ఇదే కార్యాలయంలో మంటలు అంటుకున్నాయి.

భారీగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపుచేశారు. బారీగా అగ్నికీలలు ఎగసి పడుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మొత్తం 24 అగ్నిమాపక శకటాలను ఘటనా స్థలికి రప్పించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్డడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
New Delhi
Fire Accident
one injured
lodhi road

More Telugu News