Andhra Pradesh: ప్రియుడి చేతిలో హత్యకు గురైన జ్యోతి ఇంట్లో మరో విషాదం.. మనస్తాపంతో తండ్రి మృతి

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య
  • ప్రియురాలిని చంపేసి హత్యకు గురైనట్టు నాటకం
  • కుమార్తె మృతితో తండ్రి మనస్తాపం
పెళ్లి చేసుకోమని బలవంతం చేసినందుకు ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి (24) ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఆమె తండ్రి అంగడి గోవింద్ గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె హత్యతో కుమిలిపోయిన ఆయన జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన రోజున గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న ఆయన మంగళవారం మృతి చెందారు.

 గుంటూరు జిల్లా నవులూరు వద్ద ఇటీవల  జరిగిన జ్యోతి హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. తాడేపల్లికి చెందిన ప్రియుడు చుంచు శ్రీనివాసరావు (26)తో మనస్పర్థల కారణంగా కొన్నాళ్లు అతడికి దూరంగా ఉన్న జ్యోతి ఆ తర్వాత మళ్లీ దగ్గరైంది. ఈ క్రమంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ప్రతీసారి ఏదో సాకుతో దాటవేసేవాడు. దీంతో పెళ్లి చేసుకోవాల్సిందేనని జ్యోతి ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.
 
ఈ కేసు ఛేదన పోలీసులకు తొలుత కష్టమైంది. నవులూరు స్టేడియం సమీపంలో ఏకాంతంగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు తమపై దాడిచేశారని, తీవ్ర గాయాలపాలైన జ్యోతి మృతి చెందిందని పోలీసులకు చక్కని కట్టుకథ వినిపించాడు. అయితే, శ్రీనివాసరావుపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో శ్రీనివాసరావు నిజం కక్కేశాడు. జ్యోతిని హత్య చేసింది తానేనని అంగీకరించాడు.
Andhra Pradesh
Guntur District
Jyothi
Srinivasarao
Love

More Telugu News