Chittoor District: చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు అస్వస్థత

  • సీఎంతో సమావేశానికి అమరావతి రాక
  • సమావేశానికి ముందే అస్వస్థత
  • వైద్యుల పర్యవేక్షణలో ఎమ్మెల్యే
చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జరగనున్న చిత్తూరు పార్లమెంటు సమీక్ష సమావేశం కోసం అమరావతి వచ్చిన ఆమె సమావేశంలో పాల్గొనకముందే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది.
Chittoor District
MLA DK Satyaprabha
Andhra Pradesh
Amaravathi
Telugudesam

More Telugu News