Cricket: రెండో వన్డేలోనూ టీమిండియా విక్టరీ... ఇరుజట్లలో తేడా కోహ్లీ ఇన్నింగ్సే!

  • భారత కెప్టెన్ అద్భుత సెంచరీ
  • రాణించిన బౌలర్లు
  • 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి

ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ మరో విజయం సొంతం చేసుకుంది. నాగ్ పూర్ లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. పరుగులు తీయడం చాలా కష్టమైన నాగ్ పూర్ పిచ్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీ (116) ఎంతో విలువైన శతకంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మిడిలార్డర్ లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 46 పరుగులతో రాణించగా... భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 251 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పీటర్ హ్యాండ్స్ కాంబ్ 48 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, విజయ్ శంకర్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు. సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఐదు వన్డేల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో కూడా కోహ్లీసేననే విజయం వరించింది. ఇక, ఇరుజట్ల మధ్య మూడో వన్డే మార్చి 8న రాంచీలో జరగనుంది.

More Telugu News