aadhar: ‘ఆధార్’ డేటా బయటకు వచ్చిందనడం పూర్తిగా అవాస్తవం: ఏపీ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి

  • ఆధార్ సమాచారాన్ని యూఐడీఏఐ గోప్యంగా ఉంచుతుంది
  • పీపుల్స్ పల్స్ సర్వే వివరాలు సర్వర్లలో ఉంటాయి
  • డేటా చోరీకి గురికాకుండా పటిష్ట వ్యవస్థ రూపొందించాం

‘ఆధార్’ డేటా బయటకు వచ్చిందనడం పూర్తిగా అవాస్తవమని ఏపీ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆధార్ సమాచారాన్ని యూఐడీఏఐ గోప్యంగా ఉంచుతుందని, ప్రజాసాధికార సర్వే డేటా పూర్తి స్థాయిలో భద్రంగా ఉందని స్పష్టం చేశారు.

పీపుల్స్ పల్స్ సర్వే వివరాలు సర్వర్లలో ఉంటాయని, ఇందుకు సంబంధించిన డేటాలోనూ ఎక్కడా లీకేజ్ లేదని, డేటా చోరీకి గురికాకుండా పటిష్ట వ్యవస్థను రూపొందించామని స్పష్టం చేశారు. సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, పింఛన్లు, పసుపు-కుంకుమ పథకం అమలు చేస్తున్నామని, 1100కి వచ్చే డేటాను ప్రభుత్వ శాఖలకు ఇవ్వడం లేదని వివరించారు. ఆధార్ సీడింగ్ వందశాతం పూర్తయిందని, సాంకేతికత సాయంతో పక్కాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News