నేడు వరుసగా రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

  • ఉదయం పూంచ్ సెక్టార్‌లో కాల్పులు
  • రెండోసారి నౌషిరా సెక్టార్‌లో కాల్పులు
  • సమర్థంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలు
నేటి ఉదయం పూంచ్ సెక్టార్‌లో సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడి కొన్ని గంటలు కూడా గడవక ముందే రెండోసారి మళ్లీ కాల్పులకు తెగబడింది. ఆ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ నేడు వరుసగా రెండోసారి ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ పొడవునా పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో జరిగిన ప్రాణనష్టంపై ఇప్పటి వరకూ సమాచారం అందలేదు. అయితే భారత భద్రతా బలగాలు మాత్రం పాక్ సైన్యం జరుపుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.
Go Back to Shorts
Noushira Sector
Pakistan
Indian Army
Punch Sector
Jammu Kashmir

More Telugu News