మార్చి 5ను నా జీవితంలో మరచిపోలేను: సినీ నటుడు తనీష్

05-03-2019 Tue 18:16
  • నాకున్న ఒకే ఒక్క స్ఫూర్తి
  • 16 సంవత్సరాల తరువాత కలిశాను
  • జీవితానికి సరిపోయే దీవెనలిచ్చారు
మార్చి 5ను తన జీవితంలో మరచిపోలేనని హీరో తనీష్ తెలిపాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్ తరుపున తనీష్ పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా నిన్న శివాజీరాజా ప్యానెల్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్దతు కోరింది. ఈ నేపథ్యంలో చిరుతో కలిసి తనీష్ ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో షేర్ చేసి తన ఆనందాన్ని ఓ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు.

‘‘నాకున్న ఒకే ఒక్క స్ఫూర్తి. ఆయన(చిరంజీవి) పాటలు చూస్తూ డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకునేవాడిని. 16 సంవత్సరాల తరువాత కలిశాను. ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేను. ‘మా’ ఎన్నికల్లో దీవెనల కోసం వెళ్లాను. జీవితానికి సరిపోయే దీవెనలు ఇచ్చారు. ఈ ఫీలింగ్ అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. మీకు ధన్యవాదాలు సార్. నేను మీకు ఎప్పటికీ ఏకలవ్య శిష్యుణ్ణే.  5 మార్చి, 2019 తేదీని ఎప్పటికీ మరచిపోలేను’’ అని తనీష్ పేర్కొన్నాడు.