Andhra Pradesh: ‘ఐటీ గ్రిడ్’ అశోక్ ముందుజాగ్రత్త.. పోలీసులు విచారణకు పిలిపించగానే హార్డ్ డిస్కుల తొలగింపు!

  • అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్
  • నాలుగు ప్రత్యేక టీమ్ లు రంగంలోకి 
  • రెండు సార్లు విచారణకు హాజరైన అశోక్

ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దల మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ విషయంలో మాటలయుద్ధం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలు అందిస్తున్న ఈ కంపెనీ డైరెక్టర్ అశోక్ ను గత నెల 23న సీసీఎస్ పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలిసింది. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అధికారులు అశోక్ ను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

అనంతరం మరోసారి గత నెల 27న హాజరుకావాలని సూచించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అశోక్ కీలక హార్డ్ డ్రైవ్ లను కంప్యూటర్ల నుంచి తొలగించినట్లు సమాచారం. తాజాగా ఈరోజు ఐటీ గ్రిడ్ సంస్థలో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అశోక్ ను పట్టుకునేందుకు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీలో ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత, సున్నితమైన సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

More Telugu News