Congress: కాంగ్రెస్ కు 10, ఇతర మిత్రపక్షాలకు మరో 10 సీట్లు: స్టాలిన్

  • తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక లోక్ సభ స్థానం
  • 20 స్థానాల్లో పోటీ చేయనున్న డీఎంకే
  • ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై 7న సమావేశం
తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, పొత్తులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ పార్టీ 10 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తమ మిత్ర పక్షాలు మరో 10 స్థానాల్లో పోటీ చేస్తాయని... మిగిలిన 20 స్థానాల్లో డీఎంకే పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని మార్చి 7న సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలు ఉండగా... పుదుచ్చేరిలో ఒక స్థానం ఉంది.
Congress
dmk
stalin
alliance
seats sharing

More Telugu News