gv prakash kumar: 'సర్వం తాళమయం' నుంచి ట్రైలర్ రిలీజ్

  • జీవీ ప్రకాశ్ కుమార్ నుంచి తాజా చిత్రం 
  • దర్శకుడిగా రాజీవ్ మీనన్ 
  • సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్

జీవి ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన సినిమాను, తెలుగులో 'సర్వం తాళమయం' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. పేదరికంలో పుట్టిన ఒక యువకుడు, సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగనుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

కథానాయకుడుకి సంగీతం పట్లనున్న తపన, సంగీతం నేర్చుకోవాలనుకునే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాల్లో ఎదురైన అవమానాలను ఈ ట్రైలర్లో చూపించారు. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఇంతవరకూ ఇక్కడ ఆయనకి చెప్పుకోదగిన హిట్ పడలేదు. మరి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News