karate kalyani: హరికథలు చెప్పి మా నాన్న మమ్మల్ని పోషించాడు: నటి కరాటే కల్యాణి

  • మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం
  • మా కోసం ఎంతో కష్టపడ్డారు
  • అందుకే హరికథలు వదల్లేదు 
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న నటి కరాటే కల్యాణి .. ఒక విషయం చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నాకు మా నాన్నగారు అంటే ప్రాణం .. మా కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. సైకిల్ పై ఊరూరూ తిరుగుతూ .. అక్కడ హరికథలు చెప్పి, అలా వచ్చిన డబ్బుతో మమ్మల్ని పోషించారు. ఆ డబ్బులతోనే మాకు ఫీజులు కట్టారు. మా తమ్ముడు చాలా చిన్నవాడు .. అయినా వాడు ఒక 'డోలక్' పట్టుకుని మా నాన్న కూడా వెళ్లేవాడు.

మా అమ్మగారు వచ్చిన దాంట్లోనే గుట్టుగా ఇల్లు నడుపుతూ వచ్చింది. అప్పట్లో ఆయన హరికథలు చెప్పకపోతే .. మాకు జీవనాధారమేలేదు. అందువల్లనే నేను హరికథలను వదల్లేదు. హరికథలను బతికించడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను. హరికథల కోసం ఒక కళాపీఠాన్ని స్థాపించి .. సినిమాల్లో వచ్చిన డబ్బులో కొంత కళాపీఠం నిర్వహణకు కేటాయిస్తుంటాను" అని చెప్పుకొచ్చారు.
karate kalyani
ali

More Telugu News