Andhra Pradesh: రాత్రుళ్లు ఫోన్ చేసి నన్ను వేధిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత సాధినేని యామిని!

  • సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ పోస్టింగ్
  • రోజూ 20-30 కాల్స్ తో వేధింపులు
  • గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామినికి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొంతమంది ఆకతాయిలు యామిని ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రోజూ 20 నుంచి 30 మంది ఆకతాయిలు ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. అర్ధరాత్రులు ఫోన్ చేయడంతో పాటు, అసభ్యకరమైన సందేశాలు పంపుతూ తీవ్ర మనోవేదనకు గురిచేశారు.

అంతేకాకుండా మార్ఫింగ్ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో యామిని పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరులోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌ కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్‌ అశోక్‌, కామిరెడ్డి రాము, మధుసూదనరెడ్డి, లక్ష్మీసుజాత తదితరులు ఈ వేధింపుల వెనుక ఉన్నారని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Andhra Pradesh
Guntur District
Telugudesam
Police
sadhineni yamini

More Telugu News