Yashwantapur: గొల్లప్రోలులో తప్పిన పెను ప్రమాదం.. కాలిబూడిదైన యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ బోగీ

  • గొల్లప్రోలు స్టేషన్‌లో ఘటన
  • ప్యాంట్రీ కారులో అంటుకున్న మంటలు
  • ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్యాంట్రీ కారులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బోగీ మొత్తం వ్యాపించాయి. సోమవారం అర్ధరాత్రి దాటక రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి రైలు నుంచి బయటపడ్డారు.

ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది రైలు నుంచి ఆ బోగీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖపట్టణం-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Yashwantapur
Tatanagar
Express rail
East Godavari District
Gollprolu
Rail Accident

More Telugu News