Tollywood: దోమకొండ శివాలయంలో నటుడు రామ్‌చరణ్-ఉపాసన పూజలు

  • అభిమానులతో పంచుకున్న ఉపాసన
  • శివలింగాన్ని శుభ్రం చేసిన రాంచరణ్
  • దోమకొండ కోటను తమ పూర్వీకులే కట్టించారన్న ఉపాసన
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు రాంచరణ్-ఉపాసన దంపతులు దోమకొండ శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన చరణ్ శివలింగాన్ని నీటితో శుభ్రం చేసి పూజలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన ట్వీట్ చేసింది.

కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ శివాలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. కాకతీయుల కాలంలో అంటే.. సుమారు 800 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. ఈ విషయాన్ని ఉపాసన చెబుతూ దోమకొండ కోటను మాత్రం 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులే కట్టించారని పేర్కొంది.  
Tollywood
Ramcharan
Upasana konidela
Domakonda
Shivalayam
Telangana

More Telugu News