CP Sajjanar: ఏపీ పోలీసులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు

  • లోకేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • విచారణలో ఉండగానే నా ఇంటికి వచ్చారు
  • నాపై బెదిరింపులకు పాల్పడ్డారు
ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. ఐటీ నిపుణుడు లోకేశ్వర్ రెడ్డి.. ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని తెలంగాణ పోలీసులు తెలిపారు. గ్రిడ్ సంస్థపై ఒక పక్క విచారణ జరుగుతుండగానే ఏపీ పోలీసులు తన ఇంటికి వచ్చి.. తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీ పోలీసులు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. లోకేశ్వరరెడ్డి ఇంటికెళ్లిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.  
CP Sajjanar
Lokeswar Reddy
AP Police
KPHB Police Station

More Telugu News