Devineni Uma: దొంగబ్బాయితో చేతులు కలిపి కేసీఆర్ మమ్మల్నేం చేయలేరు: దేవినేని ఉమ

  • కేసులు పెట్టిన వారితో చేతులు కలుపుతున్నారు
  • జగన్‌కు ప్రతి శుక్రవారం కోర్టు ఉంటుంది
  • వైసీపీ చెల్లని పార్టీ
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతి సోమవారం పోలవరం పర్యటన ఉన్నట్టే.. వైసీపీ అధినేత జగన్‌కు ప్రతి శుక్రవారం కోర్టు ఉంటుందని మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను దొంగబ్బాయిగా అభివర్ణించి సెటైర్లు వేశారు. చెల్లే చెక్కులే టీడీపీ ఇస్తుందని కానీ వైసీపీ మాత్రం చెల్లని పార్టీ అని ఉమ పేర్కొన్నారు.

కృష్టా జలాలను శ్రీశైలం నుంచి 2300 అడుగుల ఎత్తులో ఉన్న పలమనేరు, కుప్పానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఉమ కొనియాడారు. కేసీఆర్.. దొంగబ్బాయితో చేతులు కలిపి తమపై కేసులు పెట్టి ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. పోలవరంపై ఎంపీ కవిత కేసులు పెట్టారని.. అలాంటి వారితో దొంగబ్బాయి చేతులు కలుపుతున్నారంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Devineni Uma
Jagan
Chandrababu
Polavaram
Krishna Water
Palamaneru
kuppam

More Telugu News