Andhra Pradesh: ఏడాదిన్నర క్రితమే ప్లాన్ చేశారు.. తన ఓటును తొలగించడంపై వైఎస్ వివేకా ఆగ్రహం!

  • 50 లక్షల వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారు
  • వారిపై చర్యలు తీసుకోండి
  • పులివెందుల పోలీస్ స్టేషన్ లో వివేకా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో తన ఓటును తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తనకు తెలియకుండానే తన ఓటు తొలగించాలని దరఖాస్తు సమర్పించారని తెలిపారు. ఏడాదిన్నర క్రితమే ఇందుకు వ్యూహరచన చేశారన్నారు. ఏపీ అంతటా దాదాపు 50 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ప్రజల ఓట్లను తొలగించిన విషయంలో ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Kadapa District
YSRCP
viveka
votes
Police

More Telugu News