hailstorm: వడగళ్ల వానకు వెయ్యికిపైగా పక్షుల మృత్యువాత

  • మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఘటన
  • శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఆగకుండా కురిసిన వర్షం
  • చనిపోయిన వాటిలో 590 తెల్లకొంగలు

మధ్యప్రదేశ్‌లో కురిసిన వడగళ్ల వానకు వెయ్యికిపైగా పక్షులు మృత్యువాత పడ్డాయి. పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వడగళ్ల వానలో 1,102 పక్షులు మృతి చెందినట్టు అటవీ అధికారి ఒకరు తెలిపారు.

చింద్వారా జిల్లాలోని ఖమర్‌పానీ, కన్హర్ గ్రామాల్లో ఆగకుండా కురిసిన వడగళ్ల వానలో ఇవి ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. మృతి చెందిన వాటిలో 590 తెల్లకొంగలు, 360 చిలుకలు, 152 కాకులు ఉన్నట్టు పెంచ్ టైర్ రిజర్వు ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ విక్రం సింగ్ పరిహార్ తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం వాటిని పరీక్షించిన తర్వాత వాటిని పాతిపెట్టినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News