Airports: విమాన హైజాక్ బెదిరింపులు... ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్!

  • పలు ప్రాంతాల్లో బెదిరింపులు
  • ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రత పెంపు
  • తనిఖీల తరువాతే లోపలికి ప్రయాణికులు
  • సందర్శకులను అనుమతించని అధికారులు

విమానాలను హైజాక్ చేయనున్నామని బెదిరింపులు రావడంతో చెన్నై ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి తరువాత, భారత వాయుసేన దళాలు పాక్ పై సర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానాలను హైజాక్ చేయనున్నామని పలు ప్రాంతాల్లో బెదిరింపులు రాగా, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.

 పౌరవిమానయాన శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, భద్రతను పెంచాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే ప్రయాణికులను ఎయిర్ పోర్టులోకి పంపాలని ఆదేశించింది. ఆపై సందర్శకులను అనుమతించ వద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, కోయంబత్తూర్, విజయవాడ, బెంగళూరు తదితర దక్షిణాది రాష్ట్రాల ఎయిర్ పోర్టుల్లోనూ భద్రతను పెంచారు.

More Telugu News