Lok Janshakti Party: బుల్లెట్ల యుద్ధంలో గెలిచాం.. బ్యాలెట్‌ యుద్ధంలోనూ విజయం సాధిస్తాం: కేంద్రమంత్రి పాశ్వాన్

  • పాట్నాలో ఎన్డీయే విజయ్ సంకల్ప్ ర్యాలీ
  • తాము శాంతినే కోరుకుంటున్నామన్న పాశ్వాన్ 
  • యుద్ధానికి కూడా వెనుకాడబోమని స్పష్టీకరణ
బుల్లెట్ల యుద్ధంలో తాము గెలిచామని, బ్యాలెట్ యుద్ధంలోనూ గెలిచి తీరుతామని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఎన్డీయే ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో పాశ్వాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పుల్వామా దాడి తదనంతర పరిణామాలను మంత్రి ప్రస్తావిస్తూ.. బుల్లెట్ల యుద్ధంలో తాము విజయం సాధించామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ గెలిచి విజయం సాధిస్తామన్నారు. తాము శాంతిని కాంక్షిస్తున్నామని, అవసరమైతే యుద్ధం కూడా చేయగలమని అన్నారు. తాము బుల్లెట్లతోనూ, బ్యాలెట్‌తోనూ యుద్ధం చేస్తున్నట్టు పాశ్వాన్ చెప్పుకొచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని, బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Lok Janshakti Party
Ram Vilas Paswan
bullet
battle
NDA
Buddha
Yudha

More Telugu News