Pakistan: భారత సైనికుల దాడిపై ఆడియోను విడుదల చేసిన మసూద్ తమ్ముడు మౌలానా అమర్!

  • పాక్ మాటలన్నీ అబద్ధాలేనని నిరూపితం
  • దాడి జరిగిన మాట వాస్తవమన్న మౌలానా
  • ప్రతికారం తీర్చుకుంటామని వెల్లడి

ఇండియా సైనికులు తమపైన దాడులు చేయలేదని ఒసారి, వేసిన బాంబులు ఖాళీ ప్రాంతాల్లో పడ్డాయని మరోసారి చెప్పిన పాకిస్థాన్ వ్యాఖ్యలు తప్పని రుజువైంది. భారత వాయుసేన చేసిన దాడులు నిజమేనని జైషే మహమ్మద్ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ సోదరుడు మౌలానా అమర్‌ స్వయంగా వెల్లడించాడు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగిన తరువాతి రోజు ఉగ్రసంస్థ సీనియర్ల సమావేశం జరుగగా, అందులో పాల్గొన్న మౌలానా అమర్ వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది.

 జైషే క్యాంపులపై వైమానిక దాడులు నిజమేనని, జిహాద్‌ బోధనా కేంద్రంపై మాత్రమే దాడి జరిగిందని, ఇండియా చెబుతున్నట్టు కీలక స్థావరాలకు నష్టం కలుగలేదని ఆయన పేర్కొన్నాడు. బోధనా కేంద్రంపై దాడి తనను వేదనకు గురి చేసిందని, ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ మంచి అవకాశం ఇచ్చిందని అన్నాడు. తమపై దాడి ద్వారా యుద్ధానికి కాలు దువ్విందని, ఇండియాకు గుణపాఠం చెప్పి తీరుతామని అన్నాడు. కశ్మీర్‌ రక్షణ నిమిత్తం శిక్షణ పొందుతున్న వారిపై బాంబులేశారని, దీని ద్వారా కశ్మీర్‌ లోని ముస్లింలకు భారత్‌ మరింత దూరమైందని చెప్పాడు. కాగా, ఈ దాడిలో ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్‌ఐ అధికారి, కల్నల్‌  సలీమ్ మరణించినట్టు తెలుస్తుండగా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

More Telugu News