yogi adityanath: మోదీ అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారు: యోగి ఆదిత్యనాథ్

  • అసాధ్యాలను సుసాధ్యం చేయడం మోదీకే సాధ్యం
  • భారత్ కు ఒక దృఢ సంకల్పమున్న ప్రధాని ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు
  • ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచింది

పాకిస్థాన్ కు ప్రధాని మోదీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం మోదీకే సాధ్యమని చెప్పారు. పాక్ పై మెరుపుదాడుల విషయంలో మోదీ ఉక్కుమనిషిలా వ్యవహరించారని అన్నారు. భారత్ కు ఒక దృఢ సంకల్పమున్న ప్రధాని ఉన్నారనే సంకేతాలను ఇచ్చారని చెప్పారు. బీహార్ లోని మోతిహారిలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పుల్వామా దాడి జరిగిన తర్వాత వీర జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వమని మోదీ చెప్పారని... రోజులు గడవకుండానే పాక్ లోని ఉగ్ర శిబిరాలను మన వాయుసేన ధ్వంసం చేసిందని యోగి చెప్పారు. మన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ వెళ్లి వచ్చారని అన్నారు. ఉగ్రవాదంపై పోరును మన గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. డోక్లాంలో మన భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైన్యాన్ని కూడా మన ఆర్మీ నిలువరించిందని తెలిపారు. ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచిందని చెప్పారు.

More Telugu News