chalapathi rao: మా ఆవిడకి ప్రామిస్ చేసి సినిమాల్లోకి వచ్చాను: సీనియర్ నటుడు చలపతిరావు

  • నేను బాగా చదువుకోలేకపోయాను
  • కష్టపడి నా పిల్లలను చదివించాను
  • నాకు ఎలాంటి దురలవాట్లు లేవు  
ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు చలపతిరావు మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చారు. "మాది వ్యవసాయ కుటుంబం .. నా తల్లిదండ్రులు చదువుకోలేదు. నేను బాగా చదువుకోవాలనుకున్నాను .. కానీ నాటకాల పట్ల ఇష్టంతో పెద్దగా చదువుకోలేకపోయాను. ఈ కారణంగానే నా ముగ్గురి పిల్లలను కష్టపడి చదివించాను.

నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు .. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు మా ఆవిడ భయపడింది. 'సినిమా వాళ్లంటే తాగుతారట .. అమ్మాయిల వెంట తిరుగుతారటగదా' అంది. అప్పుడు నేను 'అమ్మాయిల జోలికి వెళ్లను .. మందు ముట్టుకోను .. సిగరెట్ల జోలికిపోను' అని మా ఆవిడకి ప్రామిస్ చేశాను .. ఆమె ఒప్పుకున్న తరువాతనే చెన్నైకి వెళ్లాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమెకిచ్చిన మాట మీదనే నిలబడి వున్నాను" అని చెప్పుకొచ్చారు. 
chalapathi rao

More Telugu News