Andhra Pradesh: జగన్ ఇంటి దగ్గర ఒవైసీ చిడతలు వాయించుకోవాల్సిందే!: ఏపీ మంత్రి జవహర్ సెటైర్

  • చంద్రబాబుకు ఒవైసీ సవాల్
  • ఘాటుగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత
  • ముస్లింలలో ఒవైసీ ఉద్రేకాన్ని రెచ్చగొడుతున్నారని మండిపాటు
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తానని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు.. కాచుకో.. ఏపీకి వస్తున్నా అని ఒవైసీ సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి జవహర్ అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు. ముస్లింలలో ఉద్రేకాన్ని, ఉన్మాదాన్ని ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఏపీ హైదరాబాద్ లోని పాతబస్తీ కాదన్న విషయాన్ని ఒవైసీ గుర్తించుకోవాలని సూచించారు. జగన్ ఇంటి దగ్గర చిడతలు వాయించడం తప్ప ఒవైసీ చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలు అన్నాక  అసంతృప్తులు ఉంటారని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకుని ముందుకు పోతామన్నారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Asaduddin Owaisi
Jagan

More Telugu News