z+ security: ఉద్రిక్తతల నేపథ్యం.. ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత

  • బీరేందర్ సింగ్, సునీల్ లకు భద్రత కట్టుదిట్టం
  • జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలంటే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
  • మన దేశంలో అత్యున్నత సెక్యూరిటీ జడ్ ప్లస్సే

భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపు మన పైలట్ ను విడుదల చేసిన పాకిస్థాన్... మరోపైపు సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతూనే ఉంది. దీంతో, రానున్న రోజుల్లో మరేం జరగనుందో ఎవరికీ అంతుబట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా, నేవీ చీఫ్ సునీల్ లన్బాలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వీరిద్దరికీ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు.

ఈ మేరకు భారత హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈరోజు నుంచే వీరికి ఈ భద్రత అమల్లోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ కు ఇప్పటికే భారీ సెక్యూరిటీ ఉన్నందున ఆయన భద్రతపై కేంద్ర హోంశాఖ సమీక్షించలేదు. మన దేశంలో అత్యున్నత సెక్యూరిటీ అంటే జడ్ ప్లస్ కేటగిరీనే. ఈ కేటగిరీలో ఉన్న వారికి 55 మంది మెరికల్లాంటి సాయుధులు రక్షణ కల్పిస్తుంటారు. వీరిలో 10 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేదా ఎన్ఎస్జీ కమెండోలు కానీ భద్రతగా ఉంటారు.

More Telugu News