Election commission: షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు: సునీల్ అరోరా

  • భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం ఎన్నికలపై ఉండదు
  • అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాలి
  • ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా తెలిపారు. ఎన్నికల షెడ్యూలులో ఎటువంటి మార్పు ఉండదని, అనుకున్న ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రెండు రోజులుగా అరోరా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా.. ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News