దొంగదెబ్బ కొట్టి.. నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన ఉగ్రవాది!
- ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు
- భద్రతా బలగాలను పసిగట్టిన ఉగ్రవాదులు
- చనిపోయినట్టుగా నటించి విచక్షణా రహితంగా కాల్పులు
చనిపోయారనుకున్న ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన బలగాలపై ఓ ఉగ్రవాది ఇక్కడే దొంగదెబ్బ కొట్టాడు. చనిపోయినట్టుగా నటించి.. భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లగానే వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఓ జవాను సహా ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.