India: విమానంలో కాదు.. రోడ్డు మార్గం ద్వారానే అభినందన్ ను పంపుతాం!: స్పష్టం చేసిన పాకిస్థాన్

  • అభినందన్ కోసం విమానం పంపుతామన్న భారత్
  • రోడ్డు మార్గంలో చాలామంది ఉంటారని వ్యాఖ్య
  • భారత ప్రతిపాదనను తిరస్కరించిన దాయాది దేశం

భారత పైలట్ అభినందన్ ను ఈరోజు విడుదల చేస్తామని దాయాది దేశం పాకిస్థాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనను ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు తరలించారు. అక్కడి నుంచి వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారత్ లోకి ఆయన అడుగుపెట్టనున్నాడు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అభినందన్ వర్ధమాన్ ను తొలుత విమానం ద్వారా భారత్ కు తీసుకెళతామని అధికారులు ప్రతిపాదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

అయితే ఇందుకు పాకిస్థాన్ తిరస్కరించిందట. రోడ్డు మార్గం ద్వారా వాఘా-అట్టారి సరిహద్దు వద్ద అభినందన్ ను అప్పగిస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. వాఘా మార్గంలో ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నందున వాయు మార్గంలో తీసుకుని రావాలని కేంద్రం భావించినప్పటికీ పాక్ అంగీకరించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News