హైదరాబాదులో ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్.. పిస్టల్ స్వాధీనం

హైదరాబాదులో ముగ్గురు నకిలీ పోలీసులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఎయిర్ పిస్టల్, టయోటా ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఒక స్థల వివాదాన్ని సెటిల్ చేసేందుకు యాదాద్రికి వెళుతున్న సమయంలో వెంకటేశ్ రెడ్డి, అశోక్ రెడ్డి, అక్కిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 36వేలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వాహనానికి పోలీస్ సైరన్ కూడా ఉండటం చూసి పోలీసులు నివ్వెరపోయారు. అరెస్ట్ అయిన వారిలో ఒక హోమ్ గార్డు కూడా ఉండటం గమనార్హం. 
Go Back to Shorts
hyderabad
fake police
arrest

More Telugu News