India: పాక్ పై మోదీ మరోసారి దాడి చేయించరన్న నమ్మకం ఏముంది?: పాక్ మంత్రి రషీద్

  • భారత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి
  • అందుకే, మోదీ దాడులు చేయించారన్న వార్తలు
  • మళ్లీ భారత్ దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి?

పాక్ ఆర్మీకి పట్టుబడ్డ ఐఏఎఫ్ పైలట్ విక్రమ్ అభినందన్ ను కొద్ది గంటల్లో భారత్ కు అప్పచెప్పనున్న తరుణంలో పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు  చేశారు. భారత్ లో ఎన్నికల నేపథ్యంలో తమ దేశంపై మోదీ కావాలనే ఈ వైమానిక దాడులు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయని, అదే గనుక నిజమైతే, భారత పైలట్ అభినందన్ ని విడుదల చేసిన తర్వాత మోదీ మరోసారి తమ దేశంపై దాడి చేయించరన్న నమ్మకం ఏముంది? అని అనుమానం వ్యక్తం చేశారు.

తమ దేశంపై మళ్లీ భారత్ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన రషీద్, భారత్ లోని ప్రతి ముస్లిం పాకిస్థాన్ గురించి ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు లేవంటూ కార్గిల్ యుద్ధం గురించి రషీద్ ప్రస్తావించారు. నాడు యుద్ధ సమయంలో ఒక్క జెట్ ఫైటర్ కూడా కార్గిల్ దాటి రాలేదని, మోదీ హయాంలో జరిగిన వైమానిక దాడుల్లో ఏకంగా 14 జెట్ ఫైటర్లు తమ భూ భాగంపై దాడి చేశాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News