Hyderabad: హైదరాబాద్ లో ఎన్ఐఏ కార్యాలయం ప్రారంభం.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి: రాజ్ నాథ్ సింగ్

  • ఎన్ఐఏ సేవలు దేశానికి ఎంతో అవసరం
  • 92 కేసుల్లో ఉగ్రవాదులకు శిక్ష పడింది
  • ఐసిస్, ఐఎస్ఐపై  రీసెర్చ్ సెల్ ఏర్పాటు చేయాలి

 హైదరాబాద్ లోని మాదాపూర్ లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ, ఎన్ఐఏ సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. ఎన్ఐఏ దర్యాప్తు చేసిన 92 కేసుల్లో ఉగ్రవాదులకు శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని అన్నారు. ఐసిస్, ఐఎస్ఐపై రీసెర్చ్ సెల్ ఏర్పాటు చేయాలని అభిప్రాయడపడ్డారు. మరి కొన్ని గంటల్లో అభినందన్ ను భారత్ కు పాక్ ఆర్మీ అప్పగించనుందని చెప్పారు. ఈ సందర్భంగా పుల్వామా దాడి ఘటన గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ దాడి అత్యంత దారుణమని అన్నారు.

More Telugu News