Andhra Pradesh: చంద్రబాబుని పట్టించుకోవాల్సిన అవసరం మోదీకి లేదు: బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి

  • రైల్వేజోన్ ఇచ్చినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు
  • టీడీపీ నేతలు ఫ్లెక్సీల డ్రామా ఆడుతున్నారు
  • ఏపీకి ఏం చేశారో విశాఖలో మోదీ వివరిస్తారు

ఏపీకి రైల్వేజోన్ ఇచ్చినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలపై బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ రాక సందర్భంగా విశాఖపట్టణంలో అలజడి రేపేందుకే టీడీపీ నేతలు ఫ్లెక్సీల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మోదీని విమర్శిస్తున్న ఆ ఫ్లెక్సీలపై తమ పేర్లు వేసుకునే ధైర్యం టీడీపీ నేతలకు లేదని అన్నారు. ఏపీకి ఏం చేశారో నేడు విశాఖలో మోదీ వివరిస్తారని, చంద్రబాబుని పట్టించుకోవాల్సిన అవసరం మోదీకి లేదని వ్యాఖ్యానించారు. యుద్ధం వల్ల ఓట్లు వస్తాయని ఎవరు వ్యాఖ్యలు చేసినా వెనక్కి తీసుకోవాలని, దేశ సమగ్రతకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News