New Delhi: ఢిల్లీలో 29 కీలక ప్రాంతాలపై ఉగ్రవాదుల గురి... పసిగట్టిన నిఘా వర్గాలు

  • అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఉగ్రమూకలు
  • హై అలర్ట్‌ ప్రకటించిన కేంద్ర హోంశాఖ
  • రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ వాయుసేన దాడుల అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న జైషే మహ్మద్‌ ఉగ్రమూకలు అదను కోసం ఎదురు చూస్తున్నాయని నిఘావర్గాలు పసిగట్టాయి. దేశ రాజధానిలోని 29 కీలక ప్రాంతాలపై గురిపెట్టాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. దీంతో రాజధానిలో కేంద్ర హోం శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతోపాటు బస్టాండ్‌లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల కోసం డేగ కళ్లతో అన్వేషిస్తున్నారు.
New Delhi
jaishe mahmad
high alert

More Telugu News