Menaka Gandhi: గాయని చిన్మయి ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ!

  • వైరముత్తు లైంగికంగా వేధించారని ఆరోపణ
  • నాలుగు నెలలు గడుస్తున్నా చర్యలు లేవు
  • మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్న మేనక

తమిళ రచయిత వైరముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయని శ్రీపాద చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి నాలుగు నెలలు అయినా, వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, చిన్మయిని కోలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నుంచి తొలగించారు. తాజాగా తన పరిస్థితిని వివరిస్తూ, కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ, చిన్మయి ఫిర్యాదు చేయగా, మేనకా గాంధీ స్పందించారు.

"మేడమ్‌... వైరముత్తు లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడిచింది. నాకు న్యాయం జరగకపోగా, తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నన్ను తప్పించారు. ప్రస్తుతం నేను కేసును కూడా పెట్టలేని పరిస్థితి. దయచేసి నాకేదన్నా దారి చూపండి" అంటూ చిన్మయి ట్వీట్ చేయగా, "మీ కేసును జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి" అని మేనక సమాధానమిచ్చారు.

More Telugu News