Abhinandan: వాల్ స్ట్రీట్ జర్నల్, అల్ జజీరా, బీబీసీ, సీఎన్ఎన్, గార్డియన్... అభినందన్ వార్తలను అందించేందుకు పోటీ!

  • ఇమ్రాన్ ఖాన్ ప్రకటనకు ప్రాధాన్యం
  • రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం
  • హర్షించే పరిణామమన్న వాల్ స్ట్రీట్ జర్నల్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు సంబంధించిన వార్తలను అందించేందుకు ప్రపంచ మీడియా పోటీ పడింది. మిగ్ విమానం కూలిపోయినప్పటి నుంచి, ఆయన అప్పగింతపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసేంత వరకూ ది వాల్ స్ట్రీట్ జర్నల్, అల్ జజీరా, సీఎన్ఎన్, ది గార్డియన్ తదితర ప్రముఖ మీడియా సంస్థలు వార్తలను అందించాయి. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఈ నిర్ణయం తీసుకుందని, తమకు పట్టుబడిన పైలట్ ను వదిలివేయడం హర్షించతగ్గ పరిణామమని వాల్ స్ట్రీట్ జర్నల్ అభివర్ణించింది.ఇక అరబ్ మీడియా అగ్రగామి అల్ జజీరా సైతం ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. రెండు దేశాల మధ్యా ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని ఇమ్రాన్ ప్రకటన తేలిక పరిచిందని పేర్కొంది. అణుశక్తి ఉన్న రెండు ఇరుగుపొరుగు రాజ్యాల మధ్య స్నేహబంధం పెరగడానికి అడుగు పడిందని ది గార్డియన్ వ్యాఖ్యానించింది. సీఎన్ఎన్, బీబీసీ తదితర సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలను అందించాయి.

More Telugu News