Andhra Pradesh: పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు: మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ

  • ప్రజలకు న్యాయం చేసేది పోలీస్ వ్యవస్థ
  • ఆ వ్యవస్థపై కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలా!
  • పోలీసుల మనోధైర్యం తగ్గించేలా మాట్లాడొద్దు

ప్రజలకు న్యాయం చేసేది పోలీస్ వ్యవస్థ అని, అయితే, అటువంటి వ్యవస్థపై కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని, పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో మాట్లాడారు.

 పోలీసుల మనోధైర్యాన్ని తగ్గించేలా మాట్లాడటం సబబు కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఈ విధమైన చర్యల ద్వారా పోలీస్ వ్యవస్థపైనా, అందులో పనిచేసే వారిపైనా నమ్మకం సన్నగిల్లేలా ఇచ్చే ప్రకటనలు చట్టబద్ధంగా నేరాలని, ఇందుకు సంబంధించి 1922లో రూపొందించిన ఓ చట్టం కూడా ఉందని అన్నారు. ఆ చట్టం ద్వారా యాక్షన్ తీసుకోవాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని గుర్తుచేశారు.

 ఈ వ్యవస్థను నమ్ముకుని చాలా మంది ఉన్నారని, మన స్వప్రయోజనాల కోసం, మన ప్రచారం కోసం ఇలాంటి వ్యవస్థల గౌరవాన్ని దిగజార్చడం తగదని, బాధ్యత కలిగిన రాజకీయ పక్షాలు ఇటువంటి స్థాయికి దిగకూడదన్నది తన అభిప్రాయమని అన్నారు.

More Telugu News