Chanda Kochchar: వీడియోకాన్ కేసులో బిగిసిన ఉచ్చు... చందకొచ్చర్ ఇంటిపై ఈడీ దాడులు!

  • ఈ ఉదయం నుంచి దాడులు
  • వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా
  • పలు కంపెనీల కార్యాలయాల్లో సోదాలు
వీడియోకాన్ గ్రూప్ నకు లాభం కలిగేలా ఐసీఐసీఐ బ్యాంక్ వ్యవహరించిందని, ఇందుకు ప్రతిగా బ్యాంకు అప్పటి ఎండీ చందకొచ్చర్ భర్త దీపక్ నిర్వహిస్తున్న నుపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టినట్టు తేలిన నేపథ్యంలో చంద కొచ్చర్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది.

చందకొచ్చర్ నివాసం, ఐసీఐసీఐ బ్యాంకు, నూపవర్ కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దాడులు జరుపుతోంది. దీపక్ కొచ్చర్ నివాసంతో పాటు, ముంబై, ఔరంగాబాద్ లోని వేణుగోపాల్ ధూత్ ఇంటిపై, మ్యాట్రిక్స్ గ్రూప్, ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Chanda Kochchar
ICICI
Videocon
ED

More Telugu News