kaushal: కౌశల్ కి సవాల్ విసిరిన టీవీ యాంకర్ మూర్తి

  • ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోండి
  • తనీష్ తో కలిసి కాఫీ కూడా తాగలేదు
  • జర్నలిజం వదిలేసి వెళ్లిపోతాను      

కొన్ని రోజులుగా కౌశల్ కి .. కౌశల్ ఆర్మీకి మధ్య ఆరోపణలు .. ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మీడియా ముందుకు వచ్చిన కౌశల్, తనీశ్ తో యాంకర్ మూర్తి కుమ్మక్కై తనకి వ్యతిరేకంగా డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా తాను కష్టపడి సంపాదించుకున్న పేరును, యాంకర్ మూర్తి నాశనం చేశాడని అన్నారు.

ఈ ఆరోపణలపై యాంకర్ మూర్తి స్పందిస్తూ .. "మీకు దమ్ముంటే మేము చేస్తోన్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోండి .. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. తనీష్ తో కుమ్మక్కయ్యానని అంటున్నారు .. ఏ సందర్భంలోనైనా తనీష్ తో కలిసి నేను కనీసం కాఫీ తగినట్టుగా అయినా నిరూపిస్తే, తగిన శిక్షకు నేను సిద్ధం. మూర్తి తప్పు చేశాడని మీలో ఎవరు నిరూపించినా నేను జర్నలిజం వదిలేసి వెళ్లిపోతాను. ఇది నా బహిరంగ సవాల్ .. ఇందుకు మీరు సిద్ధమేనా?" అంటూ సవాల్ విసిరారు. మరి దీనిపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

  • Loading...

More Telugu News