mammootty: 'యాత్ర' సాధించిన మొత్తం షేర్ వివరాలు!

  • మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
  • ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల బిజినెస్
  •  మొత్తం షేర్ 8.81కోట్లు      

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యం మాత్రమే తీసుకుని దర్శకుడు మహి.వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించాడు. ఇటీవలే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వైఎస్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 కోట్ల జినెస్ చేసింది. ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 6.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 8.81కోట్ల షేర్ ను సాధించింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకి మంచి లాభాలే వచ్చినట్టుగా సమాచారం. బయ్యర్ల విషయానికి వస్తే వాళ్లకి స్వల్ప నష్టాలు తప్పలేదని చెప్పుకుంటున్నారు. దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకుని, పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించడమే పెద్దగా ఇబ్బంది లేకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News