Pakistan: మా అమ్మ చనిపోయినట్టు నటించి పాక్ ఊచకోత నుంచి బయటపడింది: దర్శకుడు శేఖర్ కపూర్

  • విభజన సమయంలో పరిస్థితి దారుణం
  • నన్ను, నా సోదరిని పొత్తికడుపులో దాచుకుని రక్షించింది
  • పాక్ ఊచకోతలో పది లక్షల మంది చనిపోయారు

తన తల్లి చనిపోయినట్టు నటించి, తమను పొత్తి కడుపులో దాచుకుని పాక్ ఊచకోత నుంచి బయటపడిందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తెలిపాడు. భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో పది లక్షల మంది చనిపోయారని శేఖర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. నాడు జరిగిన దారుణాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు.

తాను పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పుట్టానని పేర్కొన్న శేఖర్.. పాక్ ఊచకోత నుంచి తన తల్లి ఎలా బయటపడిందీ వివరించాడు. ‘‘నన్ను, నా సోదరిని తన పొత్తికడుపులో దాచుకుని రైలులో చనిపోయినట్టు పడిపోయింది. దీంతో పాక్ అల్లరిమూకలు ఆమె చనిపోయిందని భావించి వదిలేశారు. ఆ సమయంలో పది లక్షలమంది చనిపోయారు. ఇరు దేశాల్లోనూ కోటి మంది శరణార్థులుగా మిగిలిపోయారు’’ అని శేఖర్ కపూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఒక్కరి (ఒక మతం) రక్తంతోనే ఒక్కటిగా ఉన్న భారత్.. భారత్-పాక్‌లుగా ఏర్పడ్డాయని శేఖర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాయాది దేశాల మధ్య  యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో శేఖర్ ట్వీట్ వైరల్ అయింది.

More Telugu News