samanta: సమంత .. నయనతార మధ్య గట్టిపోటీ

  • నయన్ కథానాయికగా 'ఐరా'
  • సమంత నాయికగా 'సూపర్ డీలక్స్'
  • ఒక రోజు తేడాతో రెండు సినిమాలు
తెలుగు .. తమిళ భాషల్లో నయనతార .. సమంతలకు విపరీతమైన క్రేజ్ వుంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేవారే. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు ఇంచుమించు ఒకేసారి రంగంలోకి దిగనున్నాయి .. గట్టిపోటీని ఇవ్వనున్నాయి. నయనతార ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'ఐరా' సినిమా ఈ నెల 28వ తేదీన తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ హారర్ మూవీలో నయనతార ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక సమంత .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన 'సూపర్ డీలక్స్' మార్చి 29వ తేదీన థియేటర్లకు రానుంది. రమ్యకృష్ణ పోషించిన కీలకమైన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఒకరోజు తేడాతో మాత్రమే రెండు సినిమాలు విడుదలవుతున్న కారణంగా, రెండింటి మధ్య గట్టిపోటీ ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఇదే తేదీల్లో ఈ సినిమాలను తెలుగులోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఎవరి సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. 
samanta
nayanatara

More Telugu News