Narendra Modi: మోదీ విశాఖ సభకు భారీ భద్రత.. షెడ్యూల్ ఇలా..!

  • సాయంత్రం 6:20 గంటలకు విశాఖ చేరుకోనున్న ప్రధాని
  • 40 నిమిషాల పాటు ప్రసంగించనున్న మోదీ
  • గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో భారీ భద్రత
ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర ప్రత్యేక దళాలను మోహరించారు. నగరంలోని రైల్వే మైదానంలో నేటి సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. కేంద్రం రెండు రోజల క్రితం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ అసమగ్రంగా, అన్యాయంగా ఉందంటూ నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్టు ఏర్పాటు చేశారు.  

సాయంత్రం 6:20 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ నగరంలోని నౌకాదళ వాయుస్థావరమైన ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 6:45 గంటలకు రైల్వే మైదానానికి చేరుకుని 6:55 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 7:40 గంటలకు ప్రసంగాన్ని ముగించనున్న మోదీ 7:55 గంటలకు తిరిగి బయలుదేరుతారు.  
Narendra Modi
Visakhapatnam District
BJP
Security
Andhra Pradesh

More Telugu News