Telangana: తెలంగాణలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్
  • కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు
తెలంగాణలో నేడు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 

Telangana
meteorological
Hyderabad
Rains
Tamil Nadu
Odisha

More Telugu News