Andhra Pradesh: మోదీ జీ! ఒట్టి చేతులతో ఏపీకి రావడం తలవంపుగా లేదా?: మోదీకి చంద్రబాబు లేఖ

  • 17 అంశాల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖ
  • ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
  • ఏపీ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలి
ప్రధాని మోదీ రేపు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ మోదీ రాకకు సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు, ప్రత్యేక హోదా సాధన ఉద్యమ నేతలు.. తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఓ బహిరంగ లేఖ రాశారు.

17 అంశాల గురించి ప్రస్తావిస్తూ ఈ లేఖను చంద్రబాబు రాశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన మోదీ, ఒట్టి చేతులతో ఏపీకి రావడం తలవంపుగా లేదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిన మోదీ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
bjp
modi

More Telugu News